ప్రధానమంత్రిగా నరేంద్ర మోది తెర మీదకి రావటానికి వెనకాల ఒక వంద సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతకి వెనకాల ఒక ‘జుగల్బందీ’ నడిపిన సుదీర్ఘ చరిత్ర ఆలంబనగా నిలిచింది. ఆ చరిత్ర .... 1920 దశకంలో వలసపాలకులైన బ్రిటీష్‌ వారు ప్రవేశపెట్టిన ఎన్నికలకి ప్రతిస్పందనగా హిందూ జాతీయవాదం ఆవిర్భావంతో మొదవుతుంది. క్రమంగా అది 1980 లో బిజెపి గా రూపాంతరం చెందటం, 1998-2004 కాలంలో జాతీయ ప్రభుత్వ ఏర్పాటును సాధించటం వరకూ ఈ ‘జుగల్బందీ’ చరిత్ర సాగుతుంది. అటల్‌ బీహారీ వాజపేయి, లాల్‌ కృష్ణ అద్వానీ మధ్య సాగిన ఈ ‘జుగల్బందీ’ వాళ్ళిద్దరి జీవితాలు (ఒకరు లేకుండా ఒకరు సాగలేనిరీతిలో) ఎలా పెనవేసుకుపోయి రాజకీయాలు నడిపాయో ` ఆ ప్రయాణమే ఈ రచనలో ఆవిష్కృతమవుతుంది.

వాళ్ళది ఆరు దశాబ్దాల బంధం. వాళ్ళిద్దరికీ మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. అభిరుచుల్లో తేడాలున్నాయి. అలవాట్లలో వ్యత్యాసాలున్నాయి... అయినా వాళ్లిద్దరూ కలిసి నడిచారు. రాజకీయాలు నడిపారు. ఒక సహోదరుల్లాగా, మిత్రుల్లాగా, కార్యకర్తల్లాగా వాళ్లిద్దరూ పనిచేశారు. ‘వాళ్ళని కలిసి పనిచేసేలా చేసింది ఒకే ఒక సిద్ధాంతం. ఆ ‘జుగల్బందీ’ ప్రయాణం మోదీకి ముందు ఎలా పనిచేసింది ? ఎందుకు విజయం సాధించింది ?

ఈ ప్రయాణంలో సహాయ పాత్రలు చాలా ఉన్నాయి. తన కుటుంబంలో వాజపేయిని ఒక సభ్యుడిగా చూసుకున్న ఓ రాజకుమారి, బిజెపిని దీర్ఘకాలం పోషించిన జిన్నా మనవడూ వగైరా...!

ఇంకా వందలాది పత్రాలు, పత్రికలు, ఇంటర్వ్యూులు... ఇలాంటివి చాలా ఉన్నాయి. 2010 దశాబ్దం ద్వితీయార్థంలో ఈ దేశాన్ని పాలిస్తున్న సిద్ధాంతం గురించి తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకం ఈ ‘జుగల్బందీ’.

పేజీలు : 536

Write a review

Note: HTML is not translated!
Bad           Good