శ్రీమాన్‌ సముద్రాల వెంకటరాఘవాచార్య గారి సినీ సాహితీ జీవన ప్రస్థానంలో, ఇది రెండవ మజిలీ. తెలుగు  సినీ చరిత్రలో స్వర్ణయుగంగా అభివర్ణింపబడే 1950-59 సంవత్సరాల మధ్యకాలంలో సముద్రాలవారు రచన చేసిన సినీ సాహిత్యాన్ని యీ గ్రంథంలో విశ్లేషిస్తూ వ్యాఖ్యానించాను.

సముద్రాలవారు దర్శకుడుగా అవతరించింది ఈ యుగంలోనే! అశ్వరాజ్‌ వారి 'వినాయకచవితి'కి కథ, మాటలు, పాటలు రాయడమే కాకుండా తొలిసారిగా దర్శకత్వం వహించారు.

ఈ గ్రంథంలో సముద్రాలవారు రాసిన అన్ని పాటలకు విపులమైన వ్యాఖ్యానం చేస్తూ, ఆయా చిత్రాలలో వారు రాసిన మాటల గురించి కూడా 'నాలుగు మాటలు' చెప్పాను. సాహితీ విశేషాలు శీర్షికన ప్రతి చిత్రంలోని పాటల వెలుగు జిలుగుల్ని స్థూలంగా వివరించాను. అవసరంలేదని భావించిన కొన్ని పాటలను వ్యాఖ్యానించలేదు. 'దేవదాసు', 'తెనాలి రామకృష్ణ', సారంగథర', 'భూకైలాస్‌' మొదలగు చిత్రాలను వ్యాఖ్యానించిన సందర్భంలో ఇతర సాహితీ అంశాలను కూడా సాధ్యమైనంత లోతుగా చర్చించాను....

Write a review

Note: HTML is not translated!
Bad           Good