‘‘జీవ పరిణామం పూర్తికాలేదు. తర్కం అన్నది చివరి మాటకాదు, తార్కిక జంతువు ప్రకృతిలో సర్వోత్తమ జంతువూ కాదు. మనిషి జంతువు నుండి పరిణమించినట్లే, మనిషి నుండి అతి మానవుడు పరిణమిస్తాడు’’     - శ్రీ అరవిందులు.
ఇంగ్లాండులో యువదశలో ఉన్న అరవిందునితో, భారత దేశంలో బ్రిటీషు వలసపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రపోరాటం సల్పిన అరవిందునితో ఈ పుస్తకం ప్రారంభమౌతుంది. తరువాత పారిస్‍లోని చిత్రకారులూ, కళాకారుల మధ్య మిరా అల్ఫాసా (మదర్‍) యౌవనకాల జీవితం అల్జీరియాలో ఒక అతీంద్రియవాది (అకల్టిస్టు) గా పరిణామం చెందడం వర్ణిస్తుంది. ఇద్దరూ తమ ఆధ్యాత్మిక భవితవ్యాన్ని గుర్తించారు. అది వారిని పాండిచ్చేరిలో కలిపింది. వారి చుట్టూ శిష్యులు చేరారు. శ్రీ అరవిందాశ్రమం ఏర్పడింది. భూమిపై లోకోత్తర చైతన్యస్థాపన, ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పరిణమింపజేయడం, మనిషిని అధిగమించిన ఒక నూతన ప్రాణి ఆవిర్భావం అన్న తమ జీవిత లక్ష్యాల సాధనకోసం వారు కృషిచేశారు

Write a review

Note: HTML is not translated!
Bad           Good