జాషువ ఆధునిక తెలుగు కవులలో ప్రతిఘటన చైతన్యానికి ప్రతీక, అనుభవవాదానికి ఆధ్యుడు. సంప్రదాయ ఛందస్సును ఆధునిక భావ వ్యక్తీకరణకు ఉపయోగించడంలో దిట్ట. భారతీయ సమాజాన్ని ప్రజాస్వామీకరించడానికి మొదట ఆయన పద్యాన్ని కూడా ప్రజాస్వామీకరించాడు. దళిత ఉద్యమం ప్రధాన స్రవంతి అయిన కాలం నుండి ఆయనను దళిత కవిగా మనం గుర్తిస్తున్నాం. ఇది అనివార్యమూ, అవసరమూ కూడా. అలాగే జాషువను తెలుగు కవిగా, భారతీయ కవిగా, విశ్వకవిగా అంచనా కట్టవలసి ఉంది. జాషువ తన కవిత్వం నిండా లేవనెత్తిన అనేక సాంఘీక ఆర్థిక రాజకీయ సాంస్కృతికాంశాలు అప్పటికన్నా ఇవాళ ఇంకా బలిసిపోయి ఉన్నాయి. జాషువ తాను జీవించిన కాలానికి ఎంత ప్రాసంగికుడో, నేటికీ ఆయన అంత ప్రాసంగికుడు. - డా|| రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good