అలనాటి సామాజిక అన్యాయాలకు, అవమానాలకు ప్రత్యక్ష సాక్ష్యాలైన జాషువా పద్యాలను లక్ష్యంగా తీసుకుని వ్రాసిన 'జాషువా ఆణిముత్యాలు', 'జాషువా అనర్ఘరత్నాలు', ప్రస్తుతం వ్రాసిన ''నవయుగ కవిచక్రవర్తి జాషువా మొలక వజ్రాలు'' గ్రంథం మహాకవి జాషువాపై వీరికి గల అపారమైన అభిమానాన్ని వెల్లడిస్తున్నాయి.

ఈ గ్రంథంను ఐదు భాగాలుగా విశ్లేషించబడిన జాషువా పద్యాలలోని సౌరభాలు సహృదయ పాఠకులకు జాషువా కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ''కవి సహృదయాఖ్యం విజయతే కావ్యం'' అన్నట్లుగా సహృదయులైన శ్రీ లాబన్‌బాబు గారు జాషువా కవి హృదయాన్ని ఎరిగిన వారు అందువలన ఈ గ్రంథంలో వారు పేర్కొన్న ప్రతి పద్యం వెనుక గల చారిత్రక సామాజిక దృష్టితో పాటు విశ్వ భావనతో కూడిన కవితా విశిష్టతను కూడా గుర్తించి వ్యాఖ్యానించడం వలన జాతీయ మహాకవి అయిన జాషువా తన పరిధులను విస్తరించుకుని ఎట్లా విశ్వనరుడై కనిపిస్తున్నాడో తెలుస్తుంది.

- ఆచార్య కె.యాదగిరి

సంచాలకులు, తెలుగు అకాడమి

Pages : 156

Write a review

Note: HTML is not translated!
Bad           Good