ప్రత్యామ్నాయ అభివృద్ధికి, విప్లవ ప్రజాధికారానికి దండకారణ్యం చిరునామా. పెట్టుబడితో, సంప్రదాయ వ్యవస్థలతో, సామ్రాజ్యవాదంతో పెనుగులాడుతున్న ప్రపంచ శ్రామిక వర్గానికి ఆశారేఖ. యుద్ధం, ఉత్పత్తి అనే రెండు కాళ్ళపై అక్డక మావోయిస్టు ఆచరణ సాగుతున్నది. ప్రగతి, సాంఘిక విముక్తి సాధించే మహాద్భుత సంఘర్షణ జరుగుతున్నది. పెట్టుబడికి, బూర్జువా పార్లమెంటరీ విధానానికి ప్రత్యామ్నాయం లేదనే వాదన పెచ్చరిల్లిన తరుణంలో దండకారణ్య ఆదివాసులు స్వాలంబన అభివృద్ధి నమూనాను ఎంచుకున్నారు. క్రాంతికారీ జనతన సర్కార్‌గా విప్లవ ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నారు. కథనం, డాక్యుమెంటేషన్‌, విశ్లేషణ అనే రచనా శిల్పంల మావోయిస్టు ప్రజా యుద్ధ ఆచరణపై క్షేత్ర పరిశీలన ఆధారంగా రాసిన పుస్తకం ఇది.

Pages : 565

Write a review

Note: HTML is not translated!
Bad           Good