ఆధునిక మహాభారతస్య అనుబంధ కావ్యం 'జనవంశమ్‌ కావ్యకృతి'.

మానవ సమాజంలో యుగయుగాన దీర్ఘకాలానంతరం ఐతిహాసిక కావ్యాలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. అవి తత్తద్యుగీన తత్త్వాన్ని ప్రదర్శించేవి. ఇతిహాసం యుగీనవాణి, పూర్వకాలంలో వచ్చిన ప్రతి ఇతిహాసానికి ఒక అనుబంధ కావ్యం ఉండేది - ప్రాచ్య దేశాల్లో గానీ పాశ్యాత్యదేశాలలో గానీ. వాల్మీకి రచిత రామాయణానికి ఉత్తరకాండ అనుబంధ కావ్యము. అట్లాడే వ్యాస మహాభారతానికి అనుబంధకావ్యం హరివంశమ్‌. ఇదేవిధంగా ప్రాచీనకాలంలో గ్రీసులో వచ్చిన జగద్విదితమైన ¬మర్‌ విరచిత ఇలియడ్‌ అనే ఇతిహాసానికి అడిస్సీ అనుబంధ కావ్యం. ఇతిహాస కావ్యరచనా ప్రక్రియానుసారంగా ఆధునిక మహా భారతానికి అనుబంధకావ్యంగా ఈ జనవంశమ్‌ వచ్చింది.

ప్రపంచ సాహిత్య ధోరణులకు తగినట్లుగా తన ఆలోచనాదృక్పథాన్ని విస్తరించుకొని, నూతన కవితావాహికను చేపట్టి కవితారంగంలో విశ్వజనీనప్రవృత్తిని ప్రకటించి నూతన శకాన్ని ఆరంభించిన కవి శేషేంద్ర. విమర్శకుడిగా సాహిత్యపు లోతుల్ని ఆవిష్కరింపజేసి ఆలోచనకు తాత్త్వికత అద్దిన సద్విమర్శకుడు.

ఆధునిక సాహిత్యంలో ఆంగ్లాంధ్రభాషా పరిచయాలవల్ల గొప్ప విమర్శకులు కావడం ఈ యుగ విశిష్టత. దార్శనికుడైన కవికి ప్రక్రియలన్నీ కరతలామలకంగానే ఉంటాయి. కందుకూరి వీరేశలింగం యుగం నుంచి రచయిత అనేక ప్రక్రియల్లో ప్రవేశించే పద్ధతి ఒక సంప్రదాయంగా వస్తూనే ఉంది. ఈ కోవలోకి వచ్చే విశిష్టకవి విమర్శకులు శేషేంద్రశర్మ.

Pages : 272

Write a review

Note: HTML is not translated!
Bad           Good