మోక్షమార్గాన్ని చూపే ఒక మత గ్రంథంగా రామాయణాన్ని పారాయణం చేసేవారితో నాకు పేచీ లేదు. సంస్కృతభాషలో ఆదికావ్యంగా, మహాకావ్యంగా, మధుర కావ్యంగా దాన్ని మెచ్చుకునే వారితో కూడా నేను వివాదపడను. అది కవితా సౌరభాలను గుబాళించే ఉత్తమ కావ్యం. ప్రాచీనార్వాచీన కాలంలో భాసుడు, కాళిదాసు, భవభూతి, రవీంద్రుడు మొదలైన మహాకవుల నెందరినో అది ప్రభావితులను చేసింది. ఒక రసవత్తర కావ్యమే కాక, అది చారిత్రక గ్రంథమని వాదించే వారి అజ్ఞానమే, వారి అహంకారమే నాకు దుస్సహం.

- నార్ల

సంస్కృత రామాయణంలోని ఒక ఘట్టం ఆధారంగా, విభిన్న దృక్పథాలకు ప్రతినిధులైన జాబాలి, రాముడు ముఖ్యపాత్రలుగా, రామాయణగాథను హేతువాద దృష్టి నుంచి పరిశీలిస్తున్న సుదీర్ఘ పీఠికతో, కవిగా, రచయితగా, పత్రికా సంపాదకుడుగా తెలుగునాడును ప్రభావితం చేసిన మేధావి శ్రీనార్ల రచించిన నాటిక 'జాబాలి'.

Pages : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good