ఈ చిన్న కథలను నేను తెలంగాణ యాసలో రాసిన.  ఇవి వ్యంగ్య, హాస్య కథలు.  నిజ జీవితంలో ఎదురైన సంఘటనలే వీటికి వస్తువు.  ఈ కథలలో మానవ మనస్తత్వంలోని వొంకరను (సీదీ ఉంగ్లీసే ఘీ నహీ నికల్తా..) అదే వక్రతతోనే సరిచేయడానికి ప్రయత్నించాను.  అందుకు నేను చిన్నప్పటిసంది మాట్లాడుతున్న యాసనే ఉపయోగించాను.  ఒక్క మాటలో జెప్పాలంటే నేనెట్ల మాట్లాడుతున్ననో గట్లే రాసిన.  ఇందులోని 'సత్నారి' వంటి పాత్రలు సమాజంలోని వ్యక్తులకు ప్రతీకలు. - తెలిదేవర భానుమూర్తి
పోట్వ బంపు
గీనడ్మ సత్నారిగాని కొడ్కు పెండ్లి అయ్యింది.  ఎన్కటి జమాన్ల పెండ్లి అనంగనే నెలదినాల ముంగటికెల్లి పనులు షురువు జేసెటోల్లు.  పస్పుకొమ్ములు దెచ్చి రోట్లేసి దంచెటోల్లు.  మిర్పవర్గు దెచ్చి మిరం గొట్టెటోల్లు.  ఇంటి ముంగటున్న ఆకిట్ల పందిరేసిటోల్లు.  లడ్లు జేప్పిచ్చెటోల్లు.  బగారన్నం, బజ్జీలు తీర్ల శాకాలు వొండిపిచ్చెటోల్లు.  బాజబజంత్రితోని పెండ్లి జేసెటోల్లు.  బరాత్‌ దీసెటోల్లు.
గా దినాలల్ల పెండ్లి అంటే పదారు దినాల పండ్గ.  గీ దినాలల్ల పెండ్లిలన్ని  పటాపటి పెండ్లిడ్లే.  పూలు పండ్లుగాంగనే ముందుగాల షాదికాన మాట్లాడ్తరు. పెండ్లి పత్రికలు చపాయిస్తరు.  గవ్విటిని సుట్టాలకు, దోస్తులకు బంచుతురు, చీరెలు, అంగిలు, పైంట్లు, బంగారి సొమ్ములు గొంటరు.  బాజబజంత్రి, వీడియో దీసెటోల్లే గాకుంట పోట్వలు గుంజెటోల్లను గూడ మాట్లాడ్తరు.  తల్లెకింత లెక్కన క్యాంటరింగోల్లను మాట్లాడ్తరు......

Write a review

Note: HTML is not translated!
Bad           Good