శాతవాహన చక్రవర్తుల్లో మేటి 'గౌతమీపుత్ర శాతకర్ణి'
    మౌర్యచక్రవర్తి అశోకుని తరువాత మొత్తం తెలుగు నేలను ఏకఛత్రాధిపత్యానికి తెచ్చుకున్నవారు శాతవాహనులు. ఛిముక శాతవాహనునితో ప్రారంభమైన వారి పాలన తొలుత తెలంగాణా నుంచి, అటు తరువాత మహారాష్ట్ర, కర్ణాటకలకు విస్తరించింది. మొదటి శాతకర్ణి కాలానికి మరింత విస్తృతమై, దక్షిణాపథమంతా వారి భూభాగంలో చేరింది. క్రీ.శ. 60 నుండి క్రీ.శ. 90 దాకా పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి పశ్చిమ, కర్ణాటక, మహారాష్ట్రలు గల పశ్చిమ భారతాన్ని; మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరాంచల్‌ వరకు గల ఉత్తర భారతాన్ని; రాజస్తాన్‌, గుజరాత్‌లు గల వాయువ్య భారతాన్ని; తెలంగాణౄ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులు గల దక్షిణ భారతాన్ని జయించి, మూడు సముద్రాల పర్యంతం తన ఆధిపత్యాన్ని స్థాపించి 'త్రిసముద్రతోయ పీతవాహన' అన్న బిరుదును ధరించి, అప్పటి వరకూ పాలించిన శాతవాహనుల్లో మేటి అనిపించుకొన్నాడు. శత్రువులైన శకులు, పల్లవులు, యవనులను జయించి, జంబూద్వీపాన్ని పరాయి పాలన నుంచి విముక్తం గావించాడు. శాతవాహన వంశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు. ముప్ఫై ఏళ్ళపాటు ప్రజారంజక పాలననందించిన గౌతమీపుత్ర శాతకర్ణి అప్రతిహత చక్రవర్తిగా, ఏకశూరుడుగా, ఏకథనుర్థరుడుగా, ఏకబ్రాహ్మణుడుగా కీర్తించబడినాడు. పరాక్రమంలో రామ, కేశవ, అర్జున, భీములతో పోల్చబడినవాడు.....
Pages: 76

Write a review

Note: HTML is not translated!
Bad           Good