మాగ్జిం గోర్కీ చరితార్థుడయిన కథకుడు. గోర్కీ రాసిన కథలు అనేకం విశ్వసాహిత్య వేదిక మీద గొప్ప కీర్తి గడించాయి. గోర్కీ విద్యావంతుడు కాడు. కానీ గొప్ప గొప్ప కథలు రాసాడు. అవి గొప్ప కథలు అయ్యాయంటే శిల్ప, నిర్మాణ, భాషా శైలి, సౌందర్య, రసానుభూతుల కారణంగా గొప్పవి కాలేదు. ఆనాడు తాను బతికిన సమాజం ఎంత దుర్భరమైనదో కళ్ళకు కట్టినట్లు చెప్పాడు. అంతకన్నా ఉన్నత మానవీయ సమాజాన్ని వాగ్దానం చేశాడు. అందుకే ప్రజలు ఆ కథలను గుండెలకు హత్తుకున్నారు. రాజరిక పాలనలో మగ్గిపోతున్న రష్యాలో ఫ్యూడల్‌ - భూస్వామ్య దోపిడిలో నలిగిపోతున&్న కోట్లాది మంది రష్యన్‌ల జీవితాలను ప్రభావితం చేసాయి గోర్కీ కథలు, నవలలు.

ఈ 'గోర్కి కథలు' పుస్తకంలో స్వేచ్ఛాప్రియులు, బహిష్కృతుడు, శూరుడు, ఆ....రాత్రి, పాఠకుడు, పక్షి-పాము, తుఫాను పక్షి పాట, అక్కా-తమ్ముడు, ముసిలోడు-పిల్లోడు, దేశద్రోహి తల్లి అనే 10 కథలు ఉన్నాయి.

Pages : 79

Write a review

Note: HTML is not translated!
Bad           Good