శ్రీశ్రీ రుద్రమదేవి ఆంధ్ర సమ్రాట్టయిన కాకతీయ గణపతి దేవుని కుమార్తె. ప్రపంచ చరిత్రలో పైతృకమైన రాజ్యసింహాసనం అధివసించిన రాణులలో మహోత్తమురాలు శ్రీ రుద్రమదేవి. ఉత్తచరిత్ర, నిర్మల గుణగణాలంకార, శేముషీసంపన్న, నిర్వక్రపరాక్రమధీర ఈ సామ్రాజ్ఞి.

ఆమెకు దక్షిణహస్తంగా మహామాండలిక ప్రభువు, మహాసేనాపతి గోనగన్నారెడ్డి వర్థమానపురం (నేటి వడ్డమాని) రాజధానిగా  పశ్చిమాంధ్ర భూమి ఏలుతూ ఉండేవాడు. అతని కుమారుడు బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ద్విపదకావ్యం రచించి ప్రఖ్యాతి పొందాడు.

ఈనాడు ఆంధ్రదేశం అంతా నిండివున్న రెడ్డి, వెలమ, కమ్మ, బలిజ, మున్నూరుకాపు మొదలగు ఆంధ్రుల పూర్వీకులు దుర్జయకులజులు నగు ఆంధ్ర క్షత్రియజాతికి చెందిన గోనగన్నారెడ్డి మహావీరుడు.

Pages : 259

Write a review

Note: HTML is not translated!
Bad           Good