ఇందులో 20 నిక్కమైన మంచి నీలాలున్నాయి! ఈ కథల్ని లోచూపుతో చదువుతుంటే - ప్రకృతినీ, సమాజాన్నీ, మనుషుల్నీ అతి నిశితంగా పరిశీలించడం, అధ్యయనం చేయడం శర్మగారి స్వాభావిక లక్షణంగా అనిపిస్తుంది. కథల్లో కనిపించే వస్తు విస్తృతికి అబ్బురపడతాము. ఒకే వస్తువుని - ఇతివృత్తాలుగా మార్చుకుంటూ - తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ రాసే కథకులు కాదు శర్మ గారు. అలాగే కథకు వారు స్వీకరించే నేపథ్యాన్నీ, కల్పించే వాతావరణాన్నీ గమనించుకుంటూ ఒక అవ్యక్త భావనాలోకంలోకి ప్రవేశిస్తాము. చిత్రమయిన విషయమేమిటంటే ఆ నేపథ్యం చాలా వరకు మనకు తెసిందే అవుతుంటుంది. ఆ వాతావరణ స్పర్శ కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుభవించిందే అయివుంటుంది. ఆ గుణవిశేషాన్నే కథాశాస్త్రం "కాల్పనికవాస్తవికత" అంటుంది.
ఎన్నెన్నో వైవిధ్యభరితమైన వస్తు విస్తృతి! శర్మగారి కథలన్నిటా మన చుట్టూ వున్న మనం చూస్తున్న వ్యక్తులూ, పరిస్థితులే, సంఘటనలే! వారందరి మధ్య, వాటన్నిటిమధ్య ఉత్పన్నమయ్యే సంఘర్షణలే.
శర్మగారి కథలు పాఠకులకే కాదు, రచయితలకూ 'పెద్దబాలశిక్షణ'లు!
- విహారి, సుప్రసిధ్ధ విమర్శకులు

Write a review

Note: HTML is not translated!
Bad           Good