పి.కేశవ రెడ్డి ఒక ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఇప్పటి తెలుగు రచయితలలో డాక్టర్‌ కేశవరెడ్డి దే అగ్రస్థానం, ఆయన రాసిన ఎనిమిది నవలలు విశేషంగా పాఠకుల ఆసదరణ పొందాయి. ఇతివృత్తంలోఅతని మార్గం అనితర సాధ్యం. ఆయన కొన్నినవలలు హిందీలోకి తర్జుమా కాగా, ఇంగ్లీషులో మాక్మిలన్‌, ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. రచయితగా కేశవరెడ్డి కి ఏ వాదాలతోనూ, ఉద్యమాలతోనూ సంబంధం ఉన్నవారు కాదు. అవేవీ లేకుండా తన పాఠకవర్గాన్ని సృష్టించుకున్న రచయిత డాక్టర్‌ కేశవ రెడ్డి. స్వల్ప కాలంలో నిర్థిష్టమైన వస్తువుతో, సీరియస్‌ రచనతో, వ్యాపార పత్రికలలో వ్యాపార నవలలతో పోటీ పడుతూ ఆ పత్రికల పాఠకాదరణ పొందడమే కేశవరెడ్డి నవలా రచయితగా సాధించిన విజయం. తెలుగు సాహి త్యాన్ని రచయితలే తప్ప సాధారణ పాఠకులు ఎవరూ చదవడం లేదన్న వాదనకు సరైన జవాబు డాక్టర్‌ కేశవరెడ్డి నవలలు.

కేశవ రెడ్డి తీసుకున్న ఇతివృత్తాలు చాలా క్లిష్ట మైనవి. సాధారణ మావన మాత్రులెవరూ ఊహించ లేని వికూడా. ఒంటిల్లు అనే గ్రామ కేంద్రంగా వర్ణవ్యవస్థను, వర్గాన్ని భూస్వామ్యాన్ని దాని నిజ స్వరూపా న్ని బట్టబయలు చేసిన రచన కేశవరెడ్డిది.

ఈ సెట్లో ఏడు పుస్తకాలు కలవు. అవి 1.అతడు అడవిని జయించాడు 2. సిటీ బ్యూటిఫుల్ ౩. క్షుద్రదేవత 4. చివరి గుడిసె 5. స్మశానం దున్నేరు 6.మునెమ్మ 7.రాముడుండాడు రాజ్జిముండాది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good