బాలల మానసిక వికాసానికి కథలు

తల్లిదండ్రులు పిల్ల మార్కులపట్ల, ర్యాంకుల పట్ల చూపుతున్న శ్రద్ధ వారిలోని సృజనాత్మకత పట్ల, మానసిక వికాసం పట్ల చూపటం లేదన్నది అసత్యం కాదు. పిల్లల్ని ఎంతసేపు పాఠశాల నాలుగ్గోడల మధ్య నిర్బంధించి, పాఠ్యపుస్తకాలకు పరిమితం చెయ్యాలని చూస్తున్నారు. పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తూ మానసిక ఉల్లాసం లేకుండా చేస్తున్నారు. ఇంటా బయటా పిల్లల్ని ఒత్తిడి పెడ్తూ అశాంతికి గురిచేస్తున్నారు. దానివల్ల పిల్లలు మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారు. పెద్దవాళ్లు కేవలం పిల్లల భవిత గురించే కాదు! నడత గురించి కూడా ఆలోచించాలి.

పిల్లలు చదువులో చురుగ్గా వుండాలంటే ఆట పాటలూ వుండాలి. సాహిత్యం పట్ల, కళల పట్ల అభిరుచీ కలిగి వుండాలి. అప్పుడే పిల్లల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. ఆత్మ విశ్వాసంతో, వ్యక్తిత్వవికాసంతో భవిష్యత్తుకు వాళ్లే బాటలు వేసుకోగలుగుతారు. సాహిత్య పఠనం ద్వారా పిల్లలు మానవీయ విలువల గురించి తెలుసుకోగలుగుతారు. - వల్లూరు శివప్రసాద్‌

''ఢంఢం డబడబ ఢమాఢమా!'' పిల్లల కథా సంపుటిలో నా తోక నాకిచ్చేయ్‌!, దగ్గరివాడు, ఆహా, ఏమిరుచి!, మంచి పిల్ల, మనిషికంటే మృగంమేలు, అంతా ప్రేమమయం, విచిత్ర బంధాలు, చింతామణిపెళ్లి, అమ్మకు జేజే! నాన్నకు జేజే, పిచ్చుక తల్లికి పురిటిల్లు, తరిగిపోనిది తల్లిప్రేమే!, పాయసం ఎలా వండాలి? దశరథరాముడు, ఢంఢం డబడబ ఢమాఢమా!, మొసళ్లున్నాయి జాగ్రత్త, శ్రీనివాసుడు చేసిన మేలు, అన్ని చేతులు కావాలా! అనే 17 కథలు వున్నాయి.

పేజీలు : 44

Write a review

Note: HTML is not translated!
Bad           Good