సినిమా సరదాలు - 1

నా సినిమాసరదాలు చిన్నప్పుడే, అనగా పది పన్నెండేళ్ళవయస్సులో ప్రారంభం అయ్యాయి. ఆరోజుల్లో విశాఖపట్నం లైటుహౌస్‌ దగ్గర ఒక గుడారంలో జోస్‌ ఎలక్ట్రిక్‌ బయస్కోప్‌ అనే కంపెనీ ఆడుతూ ఉండేది. కుర్చీ, బెంచీ, నేల అనే తరతమభేదాలు లేవక్కడ, అణా టిక్కెట్టు తీసుకుంటే ఎక్కడైనా కూర్చోవచ్చు, ఇసుకలో! చీకట్లో తెరమీద బొమ్మలుకదుల్తుంటే, దాని కనుగుణ్యంగా ఏదో ఒక మూలనుంచి వాద్యసంగీతం (తరచూ హార్మోనియం నుంచి) వినిపిస్తూ ఉంటే మా పిల్లలకది చాలాసరదా అనిపించేది. అప్పటికింకా అది పెద్దల కళగాని, వ్యాపారంగాని కాలేదు. చూసేది చిన్నపిల్లలు, చేసేది చిన్నతరహా వ్యాపారం. ఆ రోజుల్లో సినీమా అనేమాటకూడా చలామణీలోకి రాలేదు. మేం బయస్కోప్‌ చూసేవాళ్ళంగాని, సినిమాకు వెళ్ళే వాళ్ళంకాము.

త్వరలోనే మేం బజారుభట్టు, మాస్టర్‌ విఠల్‌, జుబేదా, సులోచన, ఎర్మిలైన్‌ మొదలైన తారల్ని గుర్తించడం నేర్చుకున్నాము. అప్పుడు మాసిస్‌టే అనే ఒక ఇటాలియన్‌ హీరో చిత్రం ఒకటి (భాష లేదు, మూకీ చిత్రం కదా!) వచ్చింది. మా నాన్నగారు ఆ వూళ్ళోని ఒకే ఒక కాలేజీలో హెడ్మాష్టరు కాబట్టి ఆయనకొక కాంప్లిమెంటరీ టిక్కెట్టు వచ్చింది. అప్పటికప్పుడే లైట్‌హౌస్‌ వద్ద పెర్మనెంటు థియేటర్‌, రిజర్వుడు, కుర్చీ, బెంచీ, నేల తరగతులు వెలిశాయి. రిజర్వుడు క్లాసులో కూర్చున్నాను. నాకేమీ కనబడలేదు. చిన్నప్పటినుంచీ నాది షార్టుసైటు. బి.యే.  రెండో ఏట ప్రవేశించేదాకా కళ్ళజోళ్ళు లేవు....

పేజీలు : 48

Write a review

Note: HTML is not translated!
Bad           Good