అదొక చిట్టడవి. ఆ అడవి ఎప్పుడూ చిన్నా, పెద్దా జంతువుల అరుపులతో, రకరకాల పక్షుల కూతలతో సందడిగా ఉంటుంది. అక్కడక్కడా గుత్తులు గుత్తులుగా పూసిన పూల సువాసన అడవంతా తిరుగుతూ ఉంటుంది. ఆ అడవి మధ్యన చిన్న నీటి గుంట ఉంది. ఆ గుంట చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఒక కోతి ఆ చెట్ల కొమ్మల మీదకు దూకుతూ ఆకులన్నీ దూసి నీళ్ళలోకి విసురుతోంది. ''ఏమిటమ్మా ఆ దూకుడు? కాయలో పళ్ళో అయితే పిల్లలు తింటారు. ఈ ఆకులేమిటి... బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు'' నీళ్ళలోంచి బయటకొచ్చి విసుగ్గా అంది ఓ తాబేలు.

''పళ్ళు కావాలని మర్యాదగా అడగవచ్చు కదా!'' అంది కోతి. అంటూనే చకచకా అవతలి చెట్లమీదకి దూకేసింది పళ్ళ కోసం.

''కావు...కావు...'' అని అరుచుకుంటూ ఆయాసంగా అక్కడ వాలింది ఓ కాకి.

కాకి పిలుపుకు నెమ్మదిగా ఒడ్డు దగ్గరకు వచ్చింది తాబేలు. ''ఏరి వీళ్ళంతా...అంతదూరం నుంచీ ఎంతో ఆత్రంగా ..ఎగురుకుంటూ వచ్చాను. తీరా చూస్తే ఇక్కడెవరూ లేరు''. అంది కాకి నిరాశగా....

Write a review

Note: HTML is not translated!
Bad           Good