భారతీయ 'జ్ఞానపీఠ్‌' అవార్డు పొందిన నవల - చిత్రసుందరి.
అఖిలన్‌ ప్రసిద్దులైన తమిళ ప్రముఖ రచయిత అసలు పేరు అభిలాండమ్‌. ఈయన రచనల్లో ఇప్పటివరకు దాదాపు 5 చారిత్రక నవలలూ, 15 సాంఘీక నవలలూ, 15 కథాసంపుటాలు, మరికొన్ని పిల్లల కథలు, యాత్రా కథనాలు, అనేక వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అఖిలన్‌ రచనలో చారిత్రక నవల 'లేంగియిన్‌ మైన్‌దాన్‌'కు 1963లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు, ''చిత్తరపావై'' (తెలుగులో చిత్రసుందరి) నవలకు 1975లో అత్యున్నత జ్ఞానపీఠ్‌ పురస్కారంతోపాటు అనేక రచనలకు వివిధ సాహితీ సంస్ధల అవార్డులు లభించాయి.

మధురాంతకం రాజారాం అనేక తమిళ రచనలను అనువాదం చేశారు. అనేక తెలుగు కథా సంకలనాలకు సంపాదకులుగా ఉన్నారు.

మనిషి యంత్రంగా మారిపోతున్న సమకాలీన సమాజంలో వేగానికన్నా లోతు నెక్కువగా అభిమానించే పాఠకుల సంఖ్య పెరుగుతూ రావడం తమిళ సాహిత్య వికాసానికి ఎంతైనా దోహదకరం అంటారు అఖిలన్‌. ఇది ఏ భాషా సాహిత్యానికైనా వర్తించే మాట.
విషయం, విన్యాసం, విలువైన సందేశం అనే మూడు ముఖ్యమైన అంశాల దృష్ట్యా భారతీయ సాహిత్యంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన నవల - చిత్ర సుందరి

Write a review

Note: HTML is not translated!
Bad           Good