సద్ధర్మ మహోపాధ్యాయ అన్నపరెడ్డి బుద్ధఘోషుడు (అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అలియాస్‌ బుద్ధఘోషుడు) 1933 ఫిబ్రవరి 22న తేదీ మహాశివరాత్రినాడు నేటి తెనాలి తాలూకా తూములూరు గ్రామంలో జన్మించారు. కొల్లిపర హైస్కూలు, గుంటూరు హిందు కళాశాలలో తొలిచదువు పూర్తిచేసి, 1954-57 ఆంధ్ర విశ్వవిధ్యాలయం, వాల్తేరులో, ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శిష్యరికంలో తత్త్వ, మనోవిజ్ఞాన శాస్త్రాలను అభ్యసించారు. తరువాత వి.ఎస్‌.ఆర్‌ & ఎన్‌.వి.ఆర్‌. కాలేజీ, తెనాలిలో తత్త్వ, మనోవిజ్ఞాన సమాజ శాస్త్రాలను డిగ్రీ విద్యార్థులకు బోధించి, 1991లో ఉద్యోగ విరమణ చేశారు.

వివిధ విషయాల మీద, ఈ మధ్య రాసిన 29 బౌద్ధ గ్రంథాలతో కలుపుకొని, ఏవైనా కాని మొత్తం 75 గ్రంథాలను రాశారు.

తెలుగు జాతికి మొదటిసారిగ ఒక గ్రంథరూపంలో, సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ను, తరవాత మొదటిసారిగ అస్తిత్వ వాదాన్ని (పల్లవి పబ్లికేషన్స్‌) పరిచయం చేసిన ఖ్యాతి వీరికే దక్కింది. తరవాత బౌద్ధాన్ని పరిచయం చేస్తూ రాసిన మానవీయబుద్ధ (పల్లవి పబ్లికేషన్స్‌), మహాబౌద్ధ విజ్ఞాన సర్వస్వనిఘంటువులు గూడ అనితర సాధ్యాలే.

తరవాత, డా|| ఆలపాటి రవీంద్రనాథ్‌ వ్యవస్థాపించిన ''మిసిమి'' మాసపత్రికకు 1996 నుంచి ఒకటిన్నర దశకాల పాటూ సంపాదకత్వం వహించి, దానిని మేధావుల పత్రికస్థాయికి పెంచారు. ఆ కాలంలోనే అనేక వైవిధ్య, వైదగ్ధ్య అంశాల మీద యెడనెడ మిసిమిలో రాసి, మేధస్సుకు పదును పెట్టిన వ్యాసాల సంకలనమే - ఈ ''చింతనాగ్ని కొడిగట్టిన వేళ''.

Pages : 277

Write a review

Note: HTML is not translated!
Bad           Good