ఇవి చరిత్ర స్వరాలు
సాధారణ చరిత్ర వినిపించని స్వరాలు. దాచేసిన స్వరాలు. చరిత్ర ప్రవాహపు వడీ సుడీ ముంచెత్తబోతుంటే ఎదురీదిన స్వరాలు. భూమ్యాకాశాలలో సగమైన తమ భాగం కోసం ఎలుగెత్తిన పర్జన్య స్వరాలు. ఏళ్ళ తరబడి బిగించిన ఉరిలో చిట్టిన కంఠనాళాల రుథిర స్వరాలు.
చీకట్లను దనుమాడే వెలుతురు కరవాలాల కరకు స్వరాలు.
కొత్త కాంతులకూ కలలకూ స్వాగతం పలికే వైతాళిక స్వరాలు.
నిరసనను చిరునవ్వుగా, ఆగ్రహాన్ని దీక్షగా కృషిగా పెదవుల వెనుక బిగించి పట్టిన సరళీ స్వరాలు.
కోమల గాంధారాలుగా, లలిత మోహనాలుగా, కాంభోజీ కదన కుతూహలాలుగా, కఠోర షడ్జమాలుగా వినిపించే సామూహిక సుస్వరాలు.
సంస్కరణ, విప్లవం సృజనాత్మకతలు ముప్పెటగా అల్లుకున్న స్వరాలు.
ఇవి చరిత్ర స్వరాలు.
చరిత్ర వినిపించని స్వరాలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good