శతాబ్దాలుగా వెట్టి చాకిరితోనూ పాలేరుతనాలతోనూ దీనంగా దుర్భరంగా నిస్సహాయంగా జీవితాలు గడుపుతూ ఆత్మగౌరవం అనే మాటకు ఆమడ దూరం పెట్టబడిన వర్గాల గురించీ - ఆ వర్గాలను పురోగమన మార్గంలో ప్రధాన స్రవంతి దిశగా నడిపించిన ఉద్యమ శక్తుల గురించీ - ఎంత చెప్పుకున్నా అది ఎప్పటికీ అంతులేని కథనమే అవుతుంది. హిందూ సమాజపు సామాజిక నిర్మితి పైనా, మతమౌఢ్యపు దౌర్భల్యాలపైనా సమరం సాగించిన ఉద్యమ శక్తుల సమాహారం 'ఆది రుద్రాంధ్ర మహోద్యమం'. ఆ మహోద్యమంలో ఎన్నో వెలుగు రవ్వలు. ఈ చరిత్రను ఎప్పటికప్పుడు ఎన్నో వెలుగు రవ్వలు. ఈ చరిత్రను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ స్ఫూర్తి పొందుతూ ముందుకు సాగవలసి ఉంది.
    ఆ సంఘర్షణాత్మక వికాస క్రమంలో బొజ్జా అప్పలస్వామి గారు, డా|| అంబేద్కర్‌ బాటలో పయనించారు. అంబేద్కర్‌ స్థాపించిన ఆలిండియా షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌ పార్టీలో క్రియాశీల సభ్యులు. ఆయన వ్యవహారశైలి, ఆలోచనా రీతి, సాహసమూ, నిర్భీతి ఆయనను ఉత్తమ ప్రజా నాయకునిగా నిలిపాయి. ఒక జాతికి మార్గదర్శకునిగా ఒక ఉద్యమకారునిగా ఆయన రాజకీయ సామాజిక గమనాన్ని వివరిస్తూ... ఆ ఆశయాలతో ఉద్యమిస్తున్న యువతరానికి జవసత్వాలను అందించే ప్రయత్నమే ఈ పుస్తకం.
Pages : 272

Write a review

Note: HTML is not translated!
Bad           Good