చలం వృక్షం అనేక శాఖలుగా విస్తరించి విరివిగా పుష్పిస్తే, వాటిలో కొన్ని సుమాలను ఏర్చి వేరువేరు సజ్జలలో నింపి పెట్టరు 'చందర్‌' గారు. చలం సమగ్ర సాహిత్యం చదివే తీరుబడి లేనివారికి, ''ఇంతకీ చలం ఏమంటాడు?'' అంటూ సార సంగ్రహం కోసం ఎదురుచూసే వారికి చలం భావ రుచిని చిన్న చిన్న శాంపిల్‌ ప్యాకెట్లలో అందించినట్లుగా సమకూర్చారు ఈ సంకలనంలో. చలం సాహిత్య సౌందర్యాన్ని కొద్దికొద్ది మోతాదులలో ''చలం సాహిత్య సంగ్రహం''గా ప్రచురించి మహా ప్రయత్నం చేసి చలం ఫౌండేషన్‌. చలం విస్తృత భావ వైవిధ్యాన్ని మన కళ్ళముందు పరచి 'అప్పుడప్పుడు మీరు కూడ ఆలోచించండి' అని పాఠకుల చింతన ప్రేరణ కోసం ఇప్పుడు ఈ సాహిత్య సుమాలను అందిస్తున్నారు చలం ఫౌండేషన్‌ వారు.

పేజీలు : 280

Write a review

Note: HTML is not translated!
Bad           Good