చలం జీవితం, సాహిత్యం వేర్వేరు కాదని, చలం జీవితం యొక్క బైప్రొడక్టే ఆయన సాహిత్యమని ఆయన పాఠకులకు తెలిసిన విషయమే. ఆయన జీవితంలో అనేక దశలున్నాయి. ఆయా దశల్లో ఆయన అనుభవించిన అనుభవాలను బట్టి ఆయనకు కొన్ని విశ్వాసాలు యేర్పడ్డాయి. యే కాలానికి యేది సత్యమని తోస్తే దాన్నే ఆయన తన రచనల్లో నిక్షిప్తం చేసి పాఠకులకందించాడు. మొదట్నించి దేనికోసమో ఆయన నిరంతరం అన్వేషణ చివర కాయనను రమణాశ్రమం తీసుకెళ్ళింది. ఇలా చలం జీవితం - సాహిత్యంలోని అనేక పార్శ్వాలను వావిలాల సుబ్బారావు గారు సాధికారికంగా విశ్లేషించడం మనకీ వ్యాసాల్లో కనిపిస్తుంది. ఎన్నో క్లిష్టమైన అంశాలను కూడా సుబ్బారావు గారు ఎంతో స్పష్టంగా చక్కని పఠనీయతా గుణం కలిగిన వచనంలో వివరించటం చాలా బావుంది. - అంపశయ్య నవీన్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good