విషతుల్యమైన రసాయనాలతో తయారైన బిళ్ళలు, ఇంజక్షన్లు మొదలైన వాటితో పనిలేకుండా, ప్రకృతిసిద్ధమైన చికిత్సా విధానాల ద్వారా వ్యాధులను నయంచేసే విశిష్ట వైద్య విధానమే ప్రకృతివైద్యం. ప్రకృతిచేత సృష్టించబడి, ప్రకృతిచేత సంరక్షించబడుతున్న మనం ఆరోగ్యకరంగా ఎలా జీవించాలో ప్రకృతివైద్యం వివరిస్తుంది. ప్రకృతి వైద్యం కేవలం ఒక చికిత్సా ప్రక్రియ మాత్రమే కాదు, ఒక జీవన విధానం. ప్రకృతి వైద్యం అత్యంత పురాతనమైనది. తరతరాల వారసత్వ సంపద. మనిషి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ప్రకృతివైద్యం ఏవిధంగా ఉపకరిస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది.

తొట్టిస్నానం, లింగస్నానం, వెన్నుపూస స్నానం, ఉష్ణపట్టి, తడిపట్టి, వేడినీటి పాదస్నానం, మృత్తికా చికిత్స, ఆవిరి చికిత్స, సూర్యకిరణ చికిత్స, వర్ణ చికిత్స, మర్దనా చికిత్స, యోగాసనాలు, ప్రాణాయామం, ఫియిజోధెరపి మొదలైన ప్రకృతి చికిత్సా విధానాలు గురించి సమగ్రంగా తెలుపుతుంది ఈ పుస్తకం.

మన శరీర నిర్మాణానికి, అభివృద్ధికి, శక్తికి, ఆరోగ్యానికి ఎటువంటి ఆహారం కావాలి? సమీకృత ఆహారం అంటే ఏమిటి? మన శరీరానికి ఎటువంటి పోషక విలువలుగల ఆహార పదార్థాలు కావాలి? మొదలైన ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది ఈ పుస్తకంలో.

Pages : 78

Write a review

Note: HTML is not translated!
Bad           Good