మానవుడికి ఊహ ఏనాడు పుట్టిందో ఆనాడే పుట్టింది కథ. అతని కళ్ళముందు కనిపిస్తున్నవీ జరుగుతున్నవీ అతనిలో స్పందన కలిగించి కొంత వింత ఊహను తోడు ఇచ్చి కథలను కల్పించేటట్లు చేశాయి. కొన్ని కులాసా కథలు, కొన్ని కన్ను విప్పే కథలు, కొన్ని కాలక్షేపం కథలు, ఆలోచనలను రేకేత్తించే కథలు. కొన్ని పాటల రూపంలోవి, కొన్ని పద్యాల రూపంలోవి, కొన్ని మామూలు వచన రూపంలోవి. ఇటువంటిది ప్రపంచలో ప్రతిదేశంలోను ప్రతి సమాజంలోను ఎన్నో కొన్ని పుడుతూనే ఉన్నాయి; ప్రతితరాన్నీ అలరిస్తూనే ఉన్నాయి. ప్రతి తరమూ తన కథాసృష్టి తాము చేస్తూనే ఉంది. ముఖ్యంగా, చిన్నపిల్లలు ఇంటువంటి కథలను విని, చదివి ఆనందిస్తూ ఉంటారు. దానితోబాటు వాళ్ళ మనస్సుల్లో ఊహ - రెక్కలు విప్పుకొని విహరిస్తుంది. సృజనాత్మకశక్తి ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకోసం కథ ఎందరెందరినీ ఆకరిస్తూనే ఉంటుంది. బుద్ధికి పదును పెడుతుంది; హృదయాన్ని కరిగిస్తుంది. తోటి మానవులపట్ల సహానుభూతినీ సానుతాపాన్నీ సహాయతా గుణాన్నీ కలిగిస్తుంది. అందువల్ల మంచికి అనుకూలతాదృష్టితో చెప్పిన కథలన్నీ సమాజానికి మేలుచేసేవే!

Write a review

Note: HTML is not translated!
Bad           Good