దళిత చరిత్రకు దర్పణం
కోస్తా ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమై ఎదిగిన దళిత ఉద్యమ చరిత్రేబొజ్జా తారకం గారి నవల 'పంచతంత్రం'. విద్యా ఉద్యోగావకాశాలనుఅందిపుచ్చుకుంటున్న తొలితరం దళితులు, అప్పుడప్పుడే వారి అనుభవంలోకివస్తున్న 'స్వాతంత్య్రం', మొదటి తరం దళిత నాయకత్వం ఎదిగిన తీరు వంటిఅంశాలను ఈ నవల కళ్ళకు కట్టినట్టు చిత్రించింది. కేవలం పరిశోధన ద్వారారాయగలిగే నవల కాదిది. గొప్ప జీవితానుభవం ఉన్నవాళ్ళు మాత్రమే రాయగలరు.
మాలపల్లెకు, జమీందారీ కుటుంబానికి మధ్య ఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగే ఈ నవలలో ముఖ్యపాత్రలు మూడు. కాపు కులస్తుడైన జమీందారు విశ్వనాథం, మాల యువకుడు విద్యార్థి నాయకుడు అయిన సూరన్న, మిలట్రీలో పనిచేసి వచ్చిన మరో మాల కులస్తుడు సుబ్బారావు. సూరన్న బాల్యం నుంచి అనేక అవమానాలకు, వివక్షకు గురవుతూ చివరికి తన కృషితో,చైతన్యంతో విద్యార్థి నాయకుడుగా ఎదిగిన తీరును చాలా బాగా చిత్రించారు.

సుబ్బారావు మాలపల్లెకు నైతిక ధైర్యాన్నిస్తూ, సూరన్నను కాపాడుకుంటూ దళిత ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తాడు. పాలేర్లుగా,వెట్టిచాకిరీ చేసే కూలీలుగా, అంటరానివారిగా అవమానాలకు, అణచివేతకు గురవుతూ బతుకుతున్న దళితులు విద్యావకాశాల వల్ల,ఉద్యమ చైతన్యం వల్ల, 'స్వాతంత్య్రం' తెచ్చిన వెసులుబాటు వల్ల విద్యావంతులుగా, నాయకులుగా రూపొందడం, జమీందార్ల అక్రమ ఆక్రమణ నుండి భూముల్ని తిరిగి తీసుకోవడం, జమీందారు ఆస్తులకు అండగా ఉన్న రెవిన్యూ పోలీసు వ్యవస్థను వ్యతిరేకించడం వంటి ఘటనలన్నిటినీ అత్యంత వాస్తవికంగా మన కళ్ళ ముందు నిలిపారు రచయిత. తారకంగారి కథన శైలి, కవిత్వం తొణికిసలాడే భాష ఈ నవలను మరింత పఠన యోగ్యం చేశాయి.
- కె. సత్యనారాయణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good