జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు.

తమను తాము సవ్యంగా వ్యక్తీకరించుకోలేకపోతూ, ఇతరులతో సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతూ, ఒంటరితనంలోకి కూరుకుపోయి, తప్పించుకు తిరుగే బిడియపు ప్రవృత్తిని ఈ గ్రంథం పటాపంచలు చేస్తుంది. బిడియపు తెరలు తొలగించి నూతన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి, స్నేహభావాన్ని అలవరుచుకోవడానికి నిరంతరం తోడ్పడే సమగ్ర గ్రంథం 'బిడియం వద్దు'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good