తెలుగుసాహితీపరుల్లో శ్రీశ్రీమీద అభిమానం అనేకవిధాలుగా ఉంది. కొందరికి వామపక్షభావాలు చెప్పాడని అభిమానం. కొందరికి గొప్ప శైలి ఉన్నవాడని అభిమానం. మరి కొందరికి అన్నివిధాల ఆరాధనాభావం. అలాటి ఆరాధనాభావంతోనే సూర్యారావు 28 కవితల్ని రాశాడు. అవన్నీ శ్రీశ్రీపై అచంచలమైన అభిమానాన్ని, అభినందననీ తెలియజేసేవే. ఇందులోని అన్ని కవితల్లోనూ ఒక లయ ఉంది. ఆ లయ  పాదాల విరుపుల సామ్యంలో కావచ్చు, భావాలు వాక్యాలద్వారా ప్రవహించే రీతిలో కావచ్చు. కవితలోని భాగాల పోలికవల్ల కావచ్చు. ఆ లయ వలన ఒక ఊపు ఈ కవితల్లో వచ్చింది.

ఉదాహరణకి :

శ్రీశ్రీలా శ్వాసించడం

కవి లక్షణం !

శ్రీశ్రీలా శాసించడం

అభ్యుదయ లక్షణం !

ఇందులోని కవితల్లో అక్కడక్కడా శ్రీశ్రీ పదాల్ని ఉపయోగించడం, కొన్ని చోట్ల శ్రీశ్రీ కవిత్వ లక్షణాన్ని కవితా రూపంలో చెప్పడం కనిపిస్తుంది.

పేజీలు : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good