'నా ఈ శరీరం నాది కాదా? దీని మీద అధికారం నాది కాదా?
దీని మీద హక్కు నాకు లేదా అని నా ఆత్మ అరిచే అరుపులను
విననట్లూ, అవి వినపడనట్లు కూచోటం నా చేత కావటం లేదు

నేనెక్కడ పరాయిదాన్ని కానో, యెక్కడ నాకూ,
నా ఆలోచనలకూ గౌరవం దొరుకుతుందో ఆ చోటుని వెదుక్కుంటూ
వెళ్ళాలి. ఆ చోటు యెక్కడా లేదని వీళ్ళు చెప్పే మాటలు నేను నమ్మను
ఒక వేళ ఇంతవరకూ ఆ చోటు యెక్కడా లేకపోతే నేను సృష్టిస్తాన.

ఆడది కేవలం పిల్లన్ని మాత్రమే సృష్టిస్తుందనుకునే వాళ్ళ కళ్ళు
తెరిపించేలా నేను కొత్త ఆలోచనలనూ, కొత్త చోటునూ సృష్టిస్తాను.''

Write a review

Note: HTML is not translated!
Bad           Good