ఇది కథల సంకలనం. దీనిలో 20 కథలూ, రెండు అనువాద కథలు (ఒకటి ఒడియా నుండి సచ్చిదానందరావుత్‌రాయ్‌గారి కథ - 'జాగీరు', రెండవది ఇంగ్లీషు నుండి హడ్వర్డ్‌ మెకార్థీ కథ 'కొండవతల') ఉన్నాయి. మొత్తం 22 కథలు.

'ఒకానొక ఏనుగు కథ'  చెప్పుకోదగ్గ, చదవవలసిన కథ. 1984లో చక్రపాణి మొదటి అవార్డు ఈ కథకి వచ్చింది. కథ చివరలో ముక్తాయింపు పేరాల్లో విషయాన్ని విప్పి చెప్పడంతో పాఠకుల అవగాహనకి రావలసిన అంశాల్ని అందించాలన్న ఉద్దేశం కనపడుతుంది.

రాళ్ళూ రత్నాలూ, నీలి దువ్వెన, తురాయి చెట్టు మళ్ళీ నవ్వింది వంటి కథలు మనుషుల స్వభావాలని పట్టి చూపెడతాయి.

నిడివి తక్కువ కథలూ ఈ సంకలనంలో ఉన్నాయి. మనుషుల్లోని హిపోక్రసీని చెప్పడాన్ని చూస్తాం. తమ స్వభావన్ని తామే గుర్తించడమూ ఉంటుంది. 'బుట్టబొమ్మలు' కథలోని వ్యక్తులు తమ అసలు స్వరూపాన్ని స్వభావాన్ని కప్పి పుచ్చుకొని పైకి మరోరకంగా పెద్ద మనుషుల్లా కనపడతారు. ఈ కథా బహుమతి పొందిన కథే.

పేజీలు : 248

Write a review

Note: HTML is not translated!
Bad           Good