భగవద్గీత మీద 'గీతా మకరందము' అనే అద్భుత భాష్యం రాసిన శ్రీ విద్యా ప్రకాశానందగిరి గీతని ఇలా ప్రస్తుతించారు.

    వ్యాసుడి రాత, ఉపనిషత్తుల మోత, అహంకారాదుల కోత, దివ్యజ్ఞాన దాత, పరమార్థ దృష్టికి మాత, దైవీ సంపదకి నేత, ముముమక్షువులకి ఊత, భవసాగరానికి ఈత, ధర్మామృత పోత, కైవల్య పథ పూత అయిన భగవద్గీత సాక్షాత్తు శ్రీ కృష్ణుడి దూత.

    'బాధ కలిగించే వాతావరణంలో ఉన్నా ఆ బాధ నాకు సోకక పోవడానికి కారణం భగవద్గీత' అని గాంధీ మహాత్ముడు చెప్పాడు.

    'నా శరీరాభివృద్ధికి తల్లి పాలు ఎంత ఉపయోగ పడ్డాయో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడింది' అని శ్రీ వినోబా భావే చెప్పారు.

    'ఈ దార్శనిక గ్రంథం అనువదింప బడకపోతే ఆంగ్ల సాహిత్యం అసంపూర్ణంగా ఉండేది' అని శ్రీ ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ చెప్పాడు.

    గీత ఆధ్యాత్మిక బోధలకే కాక, ప్రాపంచిక విషయాలకి కూడా చక్కటి మార్గదర్శి. ముఖ చిత్రంలోని పక్షి మనిషికి, దాని ప్రతిబింబం మాయకి ప్రతీక. ఆ మాయని జయించాలంటే నిత్యం గీతలో ఒక శ్లోకం లేదా కనీసం ఒక పాదం చదివినా చాలని పెద్దలు చెప్తారు. ఇంతదాకా గీతాశ్లోక తాత్పర్యాలు అచ్చ తెలుగులోనే మనకి దర్శనం ఇస్తున్నాయి. గీతా తాత్పర్యాన్ని తేలిక వాడుక భాషలో మొదటిసారి మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ పుస్తకంలో అందిస్తున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good