ఆయన జీవితంలో కొన్ని మైలురాళ్ళు... వారి పేర్లు ఒక సమూహం. అయితే వారిలో ఒకరు ధ్రువతారలాగా ప్రకాశించారు. ఆయనే భగత్‌సింగ్‌.
తిరుగులేని వీరుడు, అమరుడు అయిన భగత్‌సింగ్‌ పేరు భారతదేశ యువతరం ఊహలను జ్వలింపచేసింది. ఆయన అమరత్వ కాంతివలయం భారతదేశ అసంఖ్యాక యువ విప్లవకారుల మార్గాన్ని ప్రకాశింపచేసింది. ఇది వారి హృదయాలలో జ్వలిస్తున్న శాశ్వతజ్వాల వంటిది. భగత్‌సింగ్‌ తన సహచర కామ్రేడ్లతోపాటు చరిత్ర మరువలేని ఒక సాటిలేని వీరుడు. ఇది ఆయన గురించిన కథ. ఇంతకు ముందు వెయ్యిసార్లు చెప్పబడిన కథ యిది. అయితే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పినా ఆలకించదగిన కథ. ఆయన ఏమిటి? ఆయన తన ఆఖరి క్షణం వరకు ఏ విధంగా మారుతున్నారన్న సంక్షిప్త కథ యిది. అయితే తలారి ఉచ్చు బిగించడంతో ఆయన కథ అర్ధాంతరంగా ముగిసింది.... కానీ భారత యువతకు మార్గదర్శకంగా నిలిచింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good