ఇందులో నమోదు అయిన ర్పతి జీవితం ఈ వ్యవస్థ గతికీ, గమనానికీ చోదక శక్తి. ఇందులో సౌడును సబ్బు చేసిన చాకలి, దేశానికి రక్షణ అయిన కోయ, చెంచు, గోండు, ఆధునిక నాగరికతకు నాట్యాన్ని, సంగీతాన్ని అందించిన వాళ్ళనూ, తోలును శుద్ధిచేసి కాలికి చెప్పు, మాధ్యమానికి డప్పూ ఇచ్చిన వాళ్ళనూ, పంటకు నీటిని అందించిన నీరటి కాడూ, మలాన్ని చేతితో ఎత్తిన రెల్లి వ్యధలూ, చిందు, యక్షగానం, ఎరుకలి సోది నీ, డమరుక శబ్దం తో మేల్కొలిపే బుడబుక్కల బ్రతుకు వ్యధలూ, వీరోచిత మంగోలియన్‌ తెగలకు రక్షకులుగా వచ్చిన దండాశృలూ, ఉత్తరాంధ్ర వారాంతపు సంతలో విధి తరిమితే యాచించిన నేత్తిగోతలూ, యాచక యాటల వెతలూ, ఉత్తరభారతంలో భంగీలుగా, మేహతర్‌ లుగా పిలవబడే హడ్డీలూ, ఒక నాటి క్షత్రియ వీరోచిత గాధలను పలవరించే మాల మాస్తి, నాగరికతకు చెప్పును తొడిగిన గోడారీలూ, మనువాదపు దాస్టీకాన్ని మోస్తున్న జంగాలూ, మందులోడో వోరి మాయ లోడో అని చేయని నేరాన్ని మోస్తున్న మందులోల్లు, ఒరియా భౌరీలూ, ఇందులో నమోదు అయిన ప్రతి సంచార బ్రతుకులు వ్యవస్థ విషాద చారికలు. ఇందులో చానా కులాలు అంతరించి పోతున్నాయి. ఎన్నో కులాలు నాటి వలసపాలన మొదలు నేటి ఆధునిక నాగరికుడి వ్యవస్థీకృత దాష్టీకానికి హంతకులుగా, దొంగలుగా, దొమ్మీ వాళ్ళుగా, దొమ్మరులుగా, యాచకులుగా, వేశ్యలుగా వెలివేయబడి బ్రతుకు భారంగా ఎలమారుతున్నారు.

వాస్తవానికి 'భద్రతలేని బతుకులు' పేరుతో వస్తున్న ఈ సంచార జీవితాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఆధిపత్య చర్చల్లో కనబడకుండా, వినబడకుండా పోయిన ఆనవాళ్ళు ఈ 'భద్రతలేని బతుకులు'లో ఉన్నవి. ఈ సంచార జీవితాలు వాస్తవానికి ప్రత్యామ్నాయ చరిత్రను సజీవంగా ఉంచుతున్నారు. - డా. గుఱ్ఱం సీతారాములు

పేజీలు : 243

Write a review

Note: HTML is not translated!
Bad           Good