ఇక భామ-భీమల సంభాషణగా ఒక్కోసారి మాటల జోరుగా, విషయాల హోరుగా, అవ్యవస్థపై ఫైర్‌గా, రాజకీయాల సెటైర్‌గా సాగే ఈ రచనలు స్పృశింపని అంశాలు లేవు. సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలు, సినిమా, క్రీడలు, భక్తి, ఒకటేమిటి! ... ఆ వారం విశేషాలన్నీ వారిద్దరి సంభాషణల్లో అందిపుచ్చుకోవడం మాత్రమే కాదు, ఆ వార్తావ్యాఖ్యల 'రాంపా' జర్నలిస్టిక్‌ పనివాడితనం కూడా - వాడిగా, వేడిగా ద్యోతకం కావడం గ్రహించవచ్చు.

మకుటంలోనే చెప్పే విషయం ప్రస్ఫూటంగా ప్రకటం కావడం - రాంపా తలపెట్టు, తలకట్టు మహిమ! వాటికి వెలకట్టు తీరూ కష్టమే! తను కార్టూనిస్టు కనుకనే స్వయంగా బొమ్మకట్టు ప్రజ్ఞా, మేరియోమిరండా 'థిక్‌ లెటరింగే' కాదు 'థింక్‌ బెటరింగ్‌' కూడా తనకు సాధ్యమైంది. అక్షరాలంకరణ బ్రష్‌తోనేకాదు పెన్నుతోనూ - పదాలలో, వాక్యాలలో చేయొచ్చని తెగేసి, తెగచూపించాడీ రాతల్లో తాను. దటీజ్‌ రాంపా!

Pages : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good