ఈ 'బతుకు పుస్తకం' ఒక ధీర వచనం.

సుదీర్ఘపాఠం. కొందరు ఆదర్శాలు చెపుతారు.

ఇంకొందరు ఆదర్శవంతంగా జీవించి

చూపుతారు. గొప్ప జీవితాదర్శమంటూ దేనినీ

ప్రకటించకుండా అత్యంత సామాన్యంగా,

సరళంగా, సామ్యవాదులుగా జీవించిన

విలక్షణులు లక్ష్మణరావు, మేరీ సోలింగర్‌.

అన్ని కష్ట, నష్ట, కోప, తాప, శాపాల కాలంలో

సైతం ఈ పుస్తకమొక ధైర్యవచనమై

ప్రతిధ్వనిస్తుంది. ఉత్తగా బ్రతకటం కంటే

ఉత్కృష్టంగా జీవించడానికి అతి సామాన్యమైన

దారిని అసామాన్యరీతిలో చూపుతుంది.

ఆ దారిలో నడవాల్సిన దూరాన్ని కాకుండా

చేరాల్సిన గమ్యాన్ని గూర్చి గుర్తు చేస్తుంది

ఈ బతుకు పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good