పిల్లలే దేవుడు, దేవుడే పిల్లలుగా భావించటం చేత రచయిత 'కృష్ణా' అంటూ సంబోధన చేస్తూ రాశారు. పెద్దలు బాలలను సత్ప్రవర్తనతో తీర్చిదిద్దాలి. చిన్నతనంలోనే మానసిక సంస్కారం అలవడేటట్లు చేయాలి. దానికై మంచి ఆహారపు అలవాట్లను, పరిశుభ్రతను, మనోనిగ్రహాన్ని, శాంతస్వభావాన్ని అలవాటు చేయాలి. జ్ఞానాన్వేషణ మార్గంలో తమ ఆలోచనలను పెంచుకొనేటట్లు చేయాలి.

వందకిపైగా చెప్పిన పద్యాలలో పిల్లలకు చదువుమీద ఇష్టం కలిగి బడికి వెళ్లేలా చేయటం, పాటల ద్వారా నీతులు తెలుసుకోవటం, క్రమశిక్షణతో పెరగటం, పరిపూర్ణ వ్యక్తిత్వంతో వికసించటం జరుగుతుంది. బాలురను భావి పౌరులుగా తీర్చిదిద్దటానికి ఇలాంటి శతక పద్యాలు చదివించాలి. ప్రతి పాఠశాలలో బాలుర చేత ఈ శతకాన్ని వల్లె వేయించాలి.

బడికిని బాలుర బిలువగ

గడబిడచేయకను వేగ గంటకుముందే

బడికేగి యుండు మెప్పుడు

దడవైనను కోపగించు, దప్పగు కృష్ణా...

పేజీలు : 40

Write a review

Note: HTML is not translated!
Bad           Good