నేడు కొందరు బాల సాహిత్యవేత్తలు తమ రచనలతో ఈ రంగాన్ని సుసంపన్నం చేస్తున్నారు. వారి అనుభూతుల, అనుభవాల సారాంశమే ఈ గ్రంధం. ఒకవిధంగా 20శ.లో వెలువడిన బాల సాహిత్యానికి దర్పణం లాంటిది ఈ వ్యాస సంకలనం. ఈ గ్రంధంలోని తొలి వ్యాసంలో డాక్టరు జి.సతీష్‌ కుమార్‌ బాల సాహిత్య పుర్వాపరాలను సోదాహరణంగా వివరిస్తారు. సుప్రసిద్ధ పండిత, విమర్శకులు డాక్టరు ద్వా.నా.శాస్త్రిగారు బాల భాష - అనే వ్యాసంలో బాల భాష సోయగాలను మనోహరంగా వివరిస్తారు. భూపసాల్‌గారు బాలసాహిత్యంలో రచయితలు ఎదుర్కొంటున్న సమస్యలను, బాలల సృజనాత్మకత గురించి సుజాతాదేవి వివరిస్తారు. బాలల ప్రగతికి బాలల మనోవికాసానికి బాలసాహిత్యం ఎలా తోడ్పడుతుందో అనుభవ పూర్వకంగా బెజ్జంకి జగన్నాధాచార్యులు వివరిస్తారు. బాల సాహిత్యం నిన్న - నేటి పరిస్ధితిని ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మిగారు వివరిస్తారు. బాల సాహిత్యంలో నేడున్న స్ధితిగతులను గుడిసేవ విష్ణు ప్రసాద్‌ వివరిస్తారు. వార్త దినపత్రికలో బాలల శీర్షిక నిర్వహిస్తున్న టి.వేదాంత సూరి బాలల వ్యక్తిత్వ వికాసంపై బాల సాహిత్యం ప్రభావాన్ని గురించి చెబుతారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good