మీరు కళ్లు మూసుకుంటే...

సూర్యోదయం చీకటి అయిపోతుందా?

'నువ్వు ఏ దిక్కుకి తిరిగినా, సరే, దారికడ్డంగా నిలబడే పెనుభూతం కులవ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పారవేస్తే తప్ప నీవు రాజకీయ సంస్కరణగాని ఆర్థిక సంస్కరణ గాని సాధించ లేవు.'

ఈ మాటల్ని అంబేద్కర్‌ సుప్రసిద్ధమైన 'కుల నిర్మూలన' గ్రంథంలో రాశారు.

అంబేద్కర్‌ రాసిన 'కుల నిర్మూలన' ప్రతీ భారతీయుడు తప్పని సరిగా చదవాల్సిన ఉద్గ్రంథమని గాంధీజీ ఆనాడే చెప్పారు.

'కులనిర్మూలన'

ఎటువంటి మంత్రం భారత దేశ విముక్తికి!

ఎటువంటి ఆశయం భారత దేశ ప్రగతికి !!

ఎటువంటి నినాదం భారత విప్లవ పతాకానికి !!!

భారత దేశ విముక్తి విప్లవ సైనికులకి అంబేద్కర్‌ ప్రసాదించిన షష్ఠాక్షరీ మంత్రమే 'కు-ల-ని-ర్మూ-ల-న'

నిజమే. కుల వ్యతిరేక పోరాటం అంబేద్కర్‌తో ప్రారంభం కాలేదు. ఆయనతో ముగిసిపోలేదు. కులం పుట్టినప్పటినుంచే కులవ్యతిరేక పోరాటమూ పుట్టింది. కులం సమిసి పోయే వరకూ ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది.

ఇన్ని వేల సంవత్సరాల పోరాట చరిత్రలో కుల నిర్మూలన ఆశయాన్ని ఒక విస్పష్ట లక్ష్యంగా ముందు నిలిపిన ఘనత మాత్రం నిస్సందేహంగా మహనీయుడు అంబేద్కర్‌దే....

పేజీలు : 239

Write a review

Note: HTML is not translated!
Bad           Good