ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కధలు. సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన "అత్తగారి కధలు"కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన "నాలో నేను" పుస్తకానికి జాతీయ బహుమతి లభించింది​.

           తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన కధలు బహుముఖ ప్రజ్ఞాశాలిని శ్రీమతి భానుమతి రామకృష్ణ రచించిన "అత్తగారి కధలు". అత్తగారి అలవాట్లు ఇతరులను అక్షేపించేందుకువాడె పదజాలం రచయిత్రి నిశిత పరిశీలనలోంచి జాలువారి ప్రవాహవేగంతో సాగే సరళ సుందరమైన ఆమె శైలిలో అత్తగారు ఎల్లప్పుడు సజీవమూర్తిగా దర్శనమిస్తుంది. అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర.

           మన తెలుగు కుటుంబాలలో దాదాపుగా అంతరించి పోతున్న ఒక గొప్ప ఇనిస్టిట్యూషన్ కు అత్తగారి పాత్ర సాహిత్యంలో ఏకైక ప్రతినిధి. భానుమతి గారు వాక్యవిన్యాసం ఎంతో మనోహరము గా ఉంటుందో ప్రతి వాక్యం ఎంత హాస్య స్పోరకంగా ఉంటుందో "అత్తగారి కధలు" పుస్తకంలో యాధృచ్చికంగా ఏ పేజి చదివినా సుభోధకం అవుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good