లోకంలో చతుష్షష్టి (అరువది నాలుగు) కళలు ఉన్నాయి. ఈ అరవై నాలుగు మూల కళలు. కాని సంఖ్య విషయంలో అభిప్రాయ భేదములున్నా, ఆగమములలోని, తంత్రములలోని సంఖ్యకు, కామసూత్రములోని సంఖ్యకు సరిపోవుచున్నది. వాత్యాయనుని కామ సూత్రములలో సాధారణాధికరణమును ప్రథమాధి కరణములో విన్యాసముద్దేశక ప్రకరణంలో ఈ క్రింది అరవై నాలుగు కళలు పేర్కొనబడ్డాయి. కామ సూత్రములో ఈ అరవై నాలుగు కళలే కాకుండా మరో అరవై నాలుగు కళలు కూడా పేర్కొనబడ్డాయి. అవి 'పాంచాలి చతుష్షష్టి కళలు' అనే పేరుతో గ్రహింపబడుతున్నాయి. అరవై నాలుగు మూల కళలలో కర్మాశ్రయాలైన కళలు ఇరవై నాలుగు. జూదానికి ఆశ్రయాలైన కళలు ఇరవై. అలాగే శయనోపచారికాలైన కళలు పదహారు, ఉత్తర కళలు నాలుగు.  ఈ విధంగా మొత్తం అరవై నాలుగు. ఈ అరవై నాలుగు కళలు కామశాస్త్రానికి అంగవిద్యలు. కాబట్టి కామసూత్రాలతోపాటు ఈ విద్యలు కూడా నేర్చుకోవాలి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good