ఫేర్‌ వెల్‌ టూ యూ. 

ఆల్‌ ద బెస్ట్‌ టూ మీ. 

వీడ్కోలు చెప్పడమెలాగో నేర్చుకో. 

ప్రేమకైనా ప్రాణానికైనా, ప్రాణాన్నిమించిన ప్రేమకైనా. 

వమ్ముకాదనుకున్న విశ్వాసానికైనా. 

ఎప్పటికైనా వీడ్కోలు చెప్పక తప్పదు.

స్పర్శల జాడలకైనా, జ్జాపకాల నీడలకైనా వీడ్కోలు తప్పదు.

పాయింట్‌ టూ పాయింట్‌ - స్టేజి కేరియర్‌.

ఎక్కడ దిగేవాడు అక్కడ.

ఎక్కడ ఎక్కేవాడు అక్కడ - గప్‌చుప్‌.

తప్పు ఎంతమాత్రమూ తనది కాదు...

కానీ, నాకు తెలుసురా.

నీకేకాదు హృదయం ఉన్న ఎవడికైనా 

వీడ్కోలు చెప్పడమంటే గుండెను పీకి నేలకేసి రుద్దడమే.

ఒసేయ్‌! ఈ బాధ భరించలేనే.

ప్రొజాక్‌లో జవాబుందా, మేన్షన్‌ హౌస్లో శాంతి ఉందా?

- అరుణ్‌ సాగర్‌

Pages : 156

Write a review

Note: HTML is not translated!
Bad           Good