తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

అపరంజి :

ఓ పుత్తడి బొమ్మ అపరంజి! పడిలేచే కడలి తరంగం ఆమె జీవితంలోని ఒక్కొక్క సంఘటన తండ్రి కఠినాత్ముడు, కర్కోటకుడు. తన మొదటి భార్య సంతానాన్ని సొంత బిడ్డలుగా జూసుకుంటున్న తల్లిని వేదించాడు.

ఆ నికృష్టుని బారి నుండి పరమతస్థుడు కాపాడి, కాల భ్రమణంలో తన తల్లిని ఆయన అర్థాంగిగా జేసుకున్నాడు.

అపరంజిని వయసుతోబాటు తీర్చి దిద్ది నిండయిన సిసలైన అపరంజిని చేశాడు.

ఆమె ఓనాడు విదేశీయాత్రకు పయినమైంది. సరదాకోసం గాదు హనీమూన్‌కి అంతకంటే కాదు!

తెలుగు పడుచులు మాత్రమే బాధ్యతగా గుర్తించే రక్త సంబంధీకుల క్షేమం కోసం, వారి ఉన్నతి కోసం!

జాలి, కరుణ, బాధ్యతల హద్దులను; ప్రేమ, త్యాగం, దీక్షల సరిహద్దులను తెలుసుకోవాలంటే..

అపరంజి కథకంటే ఏం కావాలి...

పేజీలు : 216

Write a review

Note: HTML is not translated!
Bad           Good