సైన్స్‌ను కథలుగా రాయడంలో నేర్పు కావాలి. వాస్తవాన్ని యథాతథంగా చిత్రిస్తే అది వ్యాసంలా మారుతుంది. అలాగని పూర్తి ఫిక్షన్‌లో రాసినా అది ఊహకు అందదు. అలాకాకుండా సైన్స్‌ యథార్థాలను, ఆధునిక సాంకేతికతను పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా చిత్రించినదే ''అణువంత కుటుంబం''. ఇందులో మూలకణాలు మాట్లాడతాయి. పెట్టెలో ఒదిగిన గుండె ఇతరులకు మార్పిడి చేయ్డఆనికి తయారవుతూ హృదయ విదారకంగా తన కథ చెబుతుంది. ఇన్‌విట్రో పద్ధతిలో ఫలదీకరణ జరిపే కథను 'ఓవి' చెబుతుంది. మహాసముద్రాలు ఉప్పును కోల్పోతున్నాయని సముద్రజీవులు, పెన్‌కంటే నేనే గొపప& అని పెన్సిలూ, మెదడువాపు కోసం మరణించే పందులూ, బంగారు బియ్యం, తనువంతా మధువు ఇలా ప్రతి కథా మిమ్మల్ని చదివించడంతోబాటు విజ్ఞానాన్నీ పంచుతుంది. ఇక అణువంత కుటుంబం ఆలపించే విశ్వసంగీతాన్ని మీరు వినాల్సిందే.

పేజీలు : 110

Write a review

Note: HTML is not translated!
Bad           Good