అన్నదాత చదివాను...దు:ఖాన్ని ఆపుకోవడం కష్టమైపోయింది....ముఖ్యంగా నారాయణ సహదేవుడి ¬టల్లో కూర్చుని అన్నం తినమంటాడేమోనని క్షణక్షణానికి ఎదురుచూసిన ఘట్టం...దేవేంద్రా గుండె గొంతులోకి రావడమంటే ఇదే కదా. భారంగా అయింది. ఒక రైతు, అన్నదాత యింత అన్నం కోసం చూసి చూసి గొంతు తడుపుకోవడానికి జగ్గుడు నీళ్ళు తాగడం...ప్చ్‌ ఈ కథ చదివాక ఎవరికయినా అన్నం సయిస్తదా?...హృదయమున్న వ్యక్తికి..ఏందో పోయ్యా, గమ్మున తిని కూర్చోకుండా ఈ కథలు చదివేదెందుకు మనసు పాడు చేసుకునేదెందుకు అన్పించింది...గొప్ప కథ రాశావు... అంత దుర్భర పరిస్ధితిలో కూడా రైతు తనకున్న పిడికెడు మెతుకుల్లో సగం వాకిటి ముందుకొచ్చినోళ్ళకు పెట్టాలనుకోవడం...అన్నదాత కాదని ఎవరయితే మాత్రం ఎలా అంటారు...వి.ప్రతిమ (నాయుడుపేట)

Write a review

Note: HTML is not translated!
Bad           Good