ముక్కోటి ఆంధ్రులు ఒక గొడుగు నీడకు వచ్చి', 1956లో ఆంధ్రప్రదేశ్‌ అవతరించిన ఉత్సాహంలో, 'ఆంధ్రుల చరిత్ర'ను రచించి ప్రచురించిన సందర్భంలో ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్యగారు, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు నన్ను అభినందిస్తూ ఆంధ్రుల చరిత్రను విపులంగా రచించవలసిందని సలహా ఇచ్చినారు. గడచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆంధ్రుల చరిత్రలో విశేషంగా పరిశోధనలు జరిగాయి.కొత్త పురావస్తు సాక్ష్య సమాచారం లభ్యమయింది. పెద్దల సలహాను పాటిస్తూ, నూతన పరిశోధనా ఫలితాలను పొందుపరుస్తూ, సాధ్యమైనంత సమగ్రంగా ఈ ఆంధ్రుల చరిత్రను రచించడమయింది.
చరిత్ర కేవలం రాజకీయ సంఘటనల పట్టిక కాదు. భిన్న రంగాల్లో మానవకృషి, ఆ కృషి ఫలితంగా మానవ జీవితంలో, దృక్పథంలో వచ్చిన పరిణామాల - అంటే నాగరికతా సంస్కృతుల కథనం. అందుచేత రాజకీయ సంఘటనల నేపథ్యంలో పాలన విధానంలో, ఆర్ధిక కృషిలో, మత సాంఘీక సారస్వత లలిత కళా రంగాల్లో ఆయా యుగాల్లో వచ్చిన మార్పులు సమీక్షించబడినాయి. ఆంధ్రుల చరిత్రలో అనేక అంశాలపై తీవ్ర అభిప్రాయ భేదాలున్నాయి. ఆ సందర్భాల్లో భిన్న వాదాలను సమగ్రంగా చర్చించడం, రుజు దృష్టితో నిర్ణయాలు చేయడం జరిగింది.
ఆంధ్రుల చరిత్ర సంస్కృతుల్లో ఆసక్తి ఉన్న వారందరికీ ఈ గ్రంథం ఉపకరిస్తుంది నా విశ్వాసం. - రచయిత

Write a review

Note: HTML is not translated!
Bad           Good