సాహిత్యపరంగా తెలుగువారికి దక్కిన భాగ్యవిశేషాలలో - శ్రీ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం ఒకటి. ఒక పోతన భాగవతం, ఒక విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం తెలుగు వారికి ఎంతటి వైభవకారకాలో ఈ శతకం కూడా అటువంటిదే అనటంలో సందేహంలేదు. తెలుగులో భక్తి ప్రధానంగా అసంఖ్యాక శతకాలు వచ్చాయి. ప్రజల గౌరవాభిమానాలను అందుకుంటున్నాయి. అయితే ఈ శతకం మాత్రం అన్నిటి కంటే విశిష్టమైనది. తన దైవం, తన సర్వస్వం అయిన శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువును గూర్చి నిందాస్తుతిగా, స్తుతి నిందగా ఎంత భావ వైవిధ్యాన్ని ఈ కవి ఆవిష్కరించాడో చూస్తే ఆశ్చర్యానందాలు కలుగుతాయి. స్వామితో మమేకమై, స్వచ్ఛమైన అంతరంగంతో తన ఆర్తిని చమత్కార జనకంగా, రసార్థ్రంగా వెలువరించిన పద్ధతి అమోఘం.

పేజీలు : 95

Write a review

Note: HTML is not translated!
Bad           Good