సాంస్కృతిక పునరుజ్జీవన ప్రక్రియ, 19వ శతాబ్ది ప్రధమ భాగంలో ఆరంభమై, క్రమేపీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. అందులో భాగమే, దక్షిణ భారతదేశంలోని ఉద్యమాలు, ప్రత్యేకించి ఆంధ్ర దేశంలోనూ నెలకొన్న వాటిని వివరిస్తుందీ గ్రంధం. వలస పాలన తన అవసరాలకనుగుణంగా ప్రక్కన పెట్టిన రాజకీయ, విద్యా సంబంధ సంస్కరణలు కొత్త సామాజిక వర్గాల ఆవిర్బావానికి దోహదం చేశాయి. ముఖ్యంగా, వలస పాలనలో రెండో దశలో కీ.శ. 1813 తర్వాత, 1857 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అప్పుడే పట్టణ ఆధారిత విద్యావంతులు మధ్యతరగతి ఆవిర్భవించింది. ప్రధానంగా వీరే భారతీయ సమాజంలోని సాంఘిక దురాచారాలను, మత, కుల, తన కట్టుబాట్లను ధిక్కరించి ప్రాజ్ఞ (ఎన్‌లైటెన్డ్‌) సమాజానికి కృషి చేశారు. గమనించాల్సిన అంశం, 1857 తర్వాత వలస పాలన మూడో దశలో ప్రవేశించాక వలస ముందున్న సామాజిక మార్పుకు గండి పడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good