ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర, సంస్కృతి 2 (తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్‌)

ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర, సంస్కృతి సంపుటాల క్రమంలో ఇది రెండో సంపుటి. క్రీ.పూ. 500 నుంచి క్రీ.శ. 624 దాకా ప్రాచీన చారిత్రక దశను ఇది సమీక్షిస్తుంది. సకల మానవ కార్యకలాపాల రంగాల్లోనూ అద్భుతమైన, నిరంతర చలనాన్ని దర్శించిన చారిత్రక దశ ఇది. ఒకసారి ప్రతిఘటన, ఒకసారి సర్దుబాటు, పరస్పర సంస్కృతీ సమ్మేళనం ఈ దశను విశిష్టం చేశాయి. మతాలూ, ధార్మిక ఆధారాలూ పరిణామం చెందిన దశ ఇది. ఒక అవగాహన ఆధారంగా ఇది జరిగింది. రాజ వంశాలూ, సామాన్య ప్రజలూ ఒకటిగా భాగస్వాములై-శాంతియుత సహజీవనానికి మతం ఒక అవగాహన ఆధారంగా ఇది జరిగింది. రాజ వంశాలూ, సామాన్య ప్రజలూ ఒకటిగా భాగస్వాములై-శాంతియుత సహజీవనానికి మతం ఒక ఆవశ్యక సాంఘీక వ్యవస్ధగా రాజ్య ఆవిర్భావానికి చోదక శక్తిగా ఆ అవగాహన వుంది.

1960 నుంచి పరిశోధకులు సాధించిన అధ్యయనాల ఫలితాలను ఈ సంపుటి అందిస్తోంది. అప్పుడు గులాం యాజ్ఞాని సంకలనం చేసిన ప్రసిద్ధ దక్కన్‌ ప్రాచీన చరిత్ర వెలువడింది. ఈ ప్రాంతంలోని రాజకీయ, సామాజిక సాంస్కృతిక చరిత్ర గురించి అధ్యయనాలు సాగాయి. తొలి చారిత్రక దశలో ఆంధ్రదేశంలో పాలన సాగించిన అనేక రాజవంశాల గురించిన అంశాలు ఉన్నాయి. వీటిలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందులు, విష్ణుకుండినులు తొలి పల్లవులు మాఠరులు, పితృభక్తులు, నాసిస్ఠులు, తూర్పుగాంగులు వున్నారు. మతం గురించిన సుదీర్ఘ వ్యాసం వుంది. చారిత్రక స్ధలాల తవ్వకాలలో బయటపడ్డ నూతన సాక్ష్యాల మీద రూపు తీసుకుంది. బౌద్ధమత వ్యాప్తి, నాగార్జున, బుద్ధఘోష్‌లాంటి బౌధ్ధ తత్వవేత్తలు చేసిన సేవ గురించి, అమరావతి, నాగార్జున కొండలలో దర్శనీయంగా వున్నట్లు కళ, భవన నిర్మాణాల విజ్ఞానాల మీద బౌద్ధమత ప్రభావం గురించి, జైనమతం వ్యాప్తి గురించి, వైదికబ్రాహ్మణ, మత పౌరాణిక పరిణామాల గురించి, సంస్కృతీకరణ జరిగిన క్రమం గురించి చర్చిస్తుంది. ఇక ఈ సంపుటిలో పరామర్శించిన ఇతర అంశాలలో భాష, సాహిత్యం, లిపి వున్నాయి. నాణేల వ్యవస్ధ, చెలామణీ ద్రవ్యం, కళ, వాస్తు శిల్పం, ప్రతిమాశాస్త్రం, పాలనా వ్యవస్ధ ఆవిర్భావం, ర్యాం, రూపురేఖలు, చారిత్రక భూగోళం, ఈ ప్రాంత సాంస్కృతిక పటం వున్నాయి. చరిత్రకారులకు, చరిత్ర విద్యార్ధులకు అవశ్యపఠనీయ గ్రంథమిది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good