తన బిడ్డ క్షేమాన్ని అనుక్షణం కాంక్షించే తల్లి, అందుకోసం ఎంతటి కష్టాన్నైనా, నష్టాన్నైనా మౌనంగా భరిస్తుంది, చివరకు చావునైనా సంతోషంగా ఆహ్వానిస్తుంది. పదిమంది బిడ్డలనైనా తల్లి భారంగా భావింపక, తానొక్కతే ఆనందంగా సాకుతుంది. కానీ ఆ పదిమంది బిడ్డలు కలిసి ఒక తల్లిని పోషించలేకపోవడం నేటి కాలపు చేదు నిజం. అందుకే ''కుపుత్రో జాయత; క్వచిదపి కుమాతా న భవతి'' అన్న ఆర్యోక్తి అక్షరసత్యం. అమ్మ ప్రేమకు, ఔన్నత్యానికి నిలువెత్తు దర్పణం. ఇలా అమ్మ గురించి చెప్పాలంటే అది అనంతం. ఆ అనంతునికైనా అది అసాధ్యమే. అలాంటి మ¬న్నత మాతృదేవను గూర్చి పరిశోధకురాలు శ్రీమతి భ్రమరాంబగారు చక్కని శైలిలో వివరించిన తీరు అద్భుతం. ఋగ్వేదాదులను మొదలుకొని మనుస్మృతి వంటి ధర్మశాస్త్రాలలోను, రామాయణ మహాభారతేతిహాసాలలోను, చారిత్రక కావ్యాలలోను, కుమారసంభవం వంటి మహాకావ్యాలలోనూ పేర్కొన్న మాతృత్వపు విలువలను, ఆయా స్త్రీ పాత్రల తీరుతెన్నులను కడురమణీయంగా తమ లఘుసిద్ధాంత వ్యాసంలో ఆవిష్కరించారు శ్రీమతి భ్రమరాంబగారు. - పి.వరప్రసాద్‌,

Write a review

Note: HTML is not translated!
Bad           Good