సాధారణంగా ప్రాంతీయనేపథ్యం, ప్రాదేశిక కేంద్రీకరణం ఉన్న కథానికలు - 'కథలు చెబుతాయి', కొన్ని గాథల్నీ వివరిస్తాయి. వాటిలో అభూత కల్పనలు, ఐతిహ్యాలూ, మధ్య మధ్య కొన్ని చారిత్రకాంశాలూ, కొన్ని 'నిజమైన' వాస్తవాలూ ఉంటాయి! అదంతా ఒక చిత్రవర్ణపట్టకం! దాని చుట్టూ మాయ (జలతారు) తెర! వివేషమేమంటే ఈ 'ఆనాటి ఉదయగిరి దుర్గం కథలు'లోనూ ఇవన్నీ మనల్ని పలుకరిస్తాయి.

అన్ని కథల్లోనూ వర్తమానత, సమకాలీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కారణం? ప్రతి కథలోనూ తారసపడే మనుషులు ఇప్పటివారు! వారంతా ఈనాడు, మన మధ్య బతుకుతున్నవారే. ఎటొచ్చీ మనం వారిని సన్నిహితంగా రోజు వారీగా ఎరిగి ఉండక పోవచ్చు. కానీ తెలుసు.....

'మొలతాడు స్వామి' చచ్చిన తొండను నడుముకు కట్టుకుని అడవివెంట తిరుగుతున్నాడు - సంజీవని చెట్టుకోసం! దాని స్పర్శ తగిలితే - ఈ తొండ బతకాలి! వెంకటమ్మ, పెంచలయ్య జాలరి దంపతులు. వారి పట్టిన కొరమీనులు... చంపి కుండలో పడేసి ఒక పొద దగ్గర పెట్టింది కుండను. ఆ కొరమీనులు బతికిఉన్నై! ఈ అద్భుతం తెలిసి మొలతాడు స్వామి వారిని నానా తిరుగుడు తిప్పాడు. వెంకటమ్మ కుండ పెట్టిన చోటుకోసం! దొరకలేదు, ఎంత తిరిగినా 'తొండ'కి జీవం రాలేదు....

పేజీలు : 196

Write a review

Note: HTML is not translated!
Bad           Good